Trending news

Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్

[ad_1]

  • మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు

  • భారీ వర్షాలు దాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలు

  • కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్

  • కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్‌.
Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్

ప్రస్తుతం భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో.. త్రిపుర, రాజస్థాన్, గుజరాత్‌లలో జనజీవనం అతలాకుతలమైంది. అటు.. గత తొమ్మిది రోజులుగా మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు దాటికి కొండచరియలు విరిగిపడి కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్‌ కుప్ప కూలింది. ఈ ఘటనపై ఈశాన్య సరిహద్దు రైల్వే CPRO కపింజల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ.. మిజోరంలో కొత్తగా నిర్మించిన క్వాన్‌పుయ్ రైల్వే స్టేషన్ కొండచరియలు విరిగిపడటంతో పాక్షికంగా దెబ్బతింది అని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరరగలేదని చెప్పారు. కాగా.. ఆగస్టు 28న ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు

కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల దృష్ట్యా నాలుగు జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని మిజోరం ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. ఐజ్వాల్, లుంగ్లీ, హన్హతియాల్.. మమిత్ జిల్లాల పరిపాలనలు వేర్వేరుగా పబ్లిక్ నోటీసులు జారీ చేశాయి. జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఐజ్వాల్ నగరం మరియు చుట్టుపక్కల గ్రామాలలోని అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం, మట్టి విరిగిపడటం.. రాతి పడిపోయినట్లు ఐజ్వాల్ జిల్లా యంత్రాంగం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. జిల్లాలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం భారీ వర్షాల కారణంగా ఐజ్వాల్, కొలాసిబ్ జిల్లాల్లో వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. దక్షిణ మిజోరంలోని సియాహా జిల్లాలో కొన్ని రోజులు పాఠశాలలు మూసివేశారు.

Read Also: Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?



[ad_2]

Related Articles

Back to top button
Close
Close