Rahul Gandhi: అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్ డీసీల్లో పర్యటన..

[ad_1]
- సెప్టెంబర్ నెలలో అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ..
-
డల్లాస్..వాషింగ్టన్ డీసీల్లో పర్యటన.. -
టెక్సాస్ వర్సిటీ విద్యార్థులతో ఇంటరాక్షన్.. -
లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పర్యటన..

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా పంచుకున్నారు.
Read Also: Health: ప్రతి నలుగురిలో ఒకరికి ఈ సమస్య.. సకాలంలో చికిత్స తీసుకోకపోతే చాలా డేంజర్
‘‘రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మారినప్పటి నుంచి 32 దేశాల్లో ఉనికిలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా తనకు అక్కడి ప్రవాస భారతీయులు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపావేత్తలు, నాయకులు, అంతర్జాతీయ అభ్యర్థలను వచ్చాయి, మీడియాతో పాటు చాలా మంది ఆయనతో ఇంటరాక్షన్ కావాలానుకుంటున్నారు’’ అని పిట్రోడో ఒక వీడియోలో ప్రకటించాడు. రాహుల్ యూఎస్ పర్యటనకు వస్తున్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని, టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉంటుందని, భారతీయ ప్రవాసులతో సమావేశం జరగుతుందని వెల్లడించారు.
తర్వాత రోజు రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారు. అక్కడ థింక్ ట్యాంక్, నేషనల్ ప్రెస్ క్లబ్, ఇతరులతో సహా వివిధ వ్యక్తులతో ఇంటరాక్షన్ కానున్నారని పిట్రోడా చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఆసక్తి కలిగి ఉన్నారని, విభిన్న వ్యక్తులతో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీ రాయబరేలీ, కేరళ వయనాడ్ స్థానాల నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత వయనాడ్‌కి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు.
[ad_2]