Trending news

Radhika Sarathkumar: ‘కారవాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి.. నగ్నంగా వీడియోలు తీస్తారు’: రాధికా

[ad_1]

రీసెంట్‌గా బయటికి వచ్చిన హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. మళయాల సినీ పరిశ్రమలో మహిళ దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో ఈ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులపై… హేమకమిటీ రిపోర్ట్‌ పై కొందరు సీనియర్ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతూనే.. షూటింగ్స్‌తో వారు కూడా ఎదుర్కొన్న కొన్న సమస్యల గురించి ఇబ్బందుల గురించి నోరు తెరుస్తున్నారు. ఇక ఈక్రమంలో సీనియర్ హీరోయిన్ రాధిక కూడా… ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. కారవాన్‌లోని రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి హీరోయిన్స్ నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తారని చెప్పారు. అలాంటి ఘటనలు తాను చూశానంటూ చెప్పి బాంబ్‌ పెల్చారు.

ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా శరత్ కుమార్.. హేమ కమిటీ నివేదిక ఆలస్యంగా రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. 46 ఏళ్లుగా తాను ఈ రంగంలో ఉన్నానని అన్నారు. దీని గురించి ఎవ్వరూ నోరు మెదపడం లేదని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎప్పటినుంచో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. చాలా మంది నటీమణులు తన గదికి వచ్చి సహాయం కోరుతున్నారని, కేరళలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఇలా జరుగుతోందని ఆమె చెప్పారు.

అంతేకాదు కారవాన్‌లోని రహస్య కెమెరా ద్వారా తీసిన ఫుటేజీని కూడా తాను చూశానంటూ షాకింగ్ విషయం చెప్పారు రాధిక. మగవాళ్లు కారవాన్ లో హీరోయిన్స్ బట్టలు మార్చుకుంటుంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వాటిని చూసి ఎంజాయ్ చేయడం తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. వారి ఫోన్స్‌లో ప్రతి నటికి ప్రత్యేక ఫోల్డర్లు అంటాయంటూ చెప్పారు. అవి చూసిన తర్వాత భయమేసి లొకేషన్‌లో కారవాన్‌ని ఉపయోగించలేదని, బదులుగా తన హోటల్ గదికి వెళ్లేదాన్నంటూ… చెప్పారు. అయితే బయట పెట్టిన ఈ విషయాలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close