radhika merchant tricked by turkish ice cream vendor in dubai watch hilarious video

[ad_1]
- దుబాయ్‌లో అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ దంపతుల పర్యటన
- టర్కిష్ ఐస్‌క్రీమ్ షాపు దగ్గర రాధికాను ఆటపట్టించిన నిర్వాహకుడు
అంబానీ చిన్న కోడలి ఫన్నీ వీడియో వైరల్

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ దంపతులు దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. ఓ టర్కిష్ ఐస్‌క్రీం షాపు దగ్గర రాధికాను నిర్వాహకుడు ఆటపట్టించాడు. ఐస్‌క్రీమ్ చేతికి అందించినట్టే.. అందించి మాయం చేసేవాడు. దీంతో ఆమె అయోమయానికి గురైంది. కొద్దిసేపు ఆమె తన భర్తతో కలిసి ఉల్లాసాన్ని పొందింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భర్త అనంత్ అంబానీ, కుటుంబ సభ్యులతో కలిసి రాధిక దుబాయ్ వెళ్లింది. ఒక టర్కిష్ స్టాల్ దగ్గర ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. ఆ స్టాల్‌లో ఉన్న వ్యక్తి ఐస్‌క్రీం ఇవ్వడానికి ముందు కొన్ని ట్రిక్స్ ప్లే చేశాడు. రాధికా మర్చంట్‌ను సరదాగా ఆటపట్టించాడు. ఐస్‌క్రీమ్ ఆమె చేతివరకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది. కొన్ని జిమ్మిక్కుల తర్వాత ఐస్‌క్రీమ్ చేతికొచ్చింది. దాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయింది. ఈ ఫన్నీ దృశ్యాలు మీరు కూడా చూసేయండి.
[ad_2]