Trending news

Radhika: కారవాన్లో సీక్రెట్ కెమెరాలు.. రాధిక ఆరోపణలపై పోలీసులు సీరియస్?

[ad_1]

Radhika: కారవాన్లో సీక్రెట్ కెమెరాలు.. రాధిక ఆరోపణలపై పోలీసులు సీరియస్?

మలయాళ సినిమా లొకేషన్‌లోని కారవాన్‌లో నటీమణుల నగ్న దృశ్యాలను కెమెరాతో రహస్యంగా రికార్డ్ చేశారని, ఈ సన్నివేశాలను చూసి సెట్‌లోని పురుషులు కలిసి నవ్వారని రాధికా శరత్ కుమార్ సంచలన విషయం బయట పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం జోక్యం చేసుకుని రాధికా శరత్ కుమార్ నుంచి సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. రాధిక నుంచి సమాచారం సేకరించి ఆమె వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నటీమణుల భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో, నిర్మాతల సంఘం కూడా కారవాన్ యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Radhika : చెప్పుతో కొడితే సరిపోతుందా? విశాల్‌పై రాధిక సంచలన వ్యాఖ్యలు!

శుక్రవారం ఉదయం 11 గంటలకు కొచ్చిలో కారవాన్ యజమానుల సమావేశం నిర్వహించాలని ఫెఫ్కా నిర్ణయించింది. రాధిక వెల్లడించిన సమాచారం నేపథ్యంలో వచ్చే శుక్రవారం కారవాన్ యజమానుల సమావేశం నిర్వహించనున్నట్లు నిర్మాతల సంఘం పేర్కొంది. మలయాళ సినిమా లొకేషన్లలో క్యారవాన్లలో నటీమణుల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు రాధికా శరత్ కుమార్ వెల్లడించిన నేపథ్యంలో పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. రాధిక నుంచి ఫోన్‌లో ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, అది అధికారికంగా రికార్డ్ చేయబడుతుంది. దాని ఆధారంగా కేసు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close