Pushpa 2: The Rule: కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన పుష్పరాజ్.. ఈసారి రావడం పక్కా.! తగ్గేదేలే..

[ad_1]
డిసెంబర్ లో రష్ పెరుగుతోంది. అసలు ఇంకో రెండు, మూడేళ్ల వరకు వస్తారో రారో అనుకున్న మహేష్ కూడా డిసెంబర్లోనే పలకరిస్తానంటున్నారు. అటు బాలయ్య 109 కూడా డిసెంబర్లోనే విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో.. 100 డేస్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన పుష్ప సీక్వెల్ స్టేటస్ ఏంటని ఆరా తీస్తున్నారు జనాలు. అఖండ సినిమాను గట్టిగానే గుర్తుచేసుకుంటున్నారు నందమూరి అభిమానులు.
ఆ సినిమా విడుదలైన డిసెంబర్ 2న బాలయ్య లేటెస్ట్ సినిమా వస్తే చూడాలని ఉందంటూ రిక్వెస్టులు అందుతున్నాయి. అయితే సంక్రాంతికి, లేకుంటే అంతకన్నా ముందే బాలయ్య 109ని విడుదల చేయాలనుకున్నారు మేకర్స్.
మరి ఇప్పుడు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తారా.? అటు డిసెంబర్లోనే ముఫాసాతో ఫ్యాన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు మహేష్. గేమ్ చేంజర్ అండ్ అదర్ సినిమాలు ఎలాగూ క్యూలో ఉన్నాయి. వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుస్తూనే ఉంది.
మరి పుష్ప2 పరిస్థితి ఏంటి? షూటింగ్ ఎంత వరకు వచ్చింది.? రామోజీ ఫిల్మ్ సిటీలో నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప2. అక్టోబర్‌కి టాకీ మొత్తం పూర్తి చేసేయాలన్న టార్గెట్‌తో పరుగులు తీస్తోంది టీమ్.
ఆ తర్వాత మిగిలిన పాటల మీద ఫోకస్ చేస్తారని టాక్. పుష్ప2 పాటల గురించి ప్రస్తావన వస్తే, అందరి దృష్టీ స్పెషల్ సాంగ్ మీదకే వెళ్తోంది. ఫస్ట్ పార్టుకి అన్ని లాంగ్వేజెస్‌లోనూ విపరీతమైన హైప్ తెచ్చింది ఉ అంటావా ఉఊ అంటావా సాంగ్.
మరి ఇప్పుడు దాన్ని తలదన్నేలా సుకుమాస్టర్ ప్లాన్ చేస్తున్నారా? ఈసారి స్పెషల్ భామగా ఎవరిని ఫిక్స్ చేశారు అనే టాపిక్ మీద క్యూరియాసిటీ తెగ పెరిగిపోతోంది జనాలకు.
[ad_2]