Pushpa 2: మరో 100 రోజుల్లో అల్లు అర్జున్ పుష్ఫ 2 రిలీజ్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

[ad_1]
అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప2 :ది రూల్’. మూడేళ్ల క్రితం ఇదే కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు ఇది సీక్వెల్. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ క్రేజీ మూవీ కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 100 రోజుల్లో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఒక పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసింది. ‘‘మరో వంద రోజుల్లో అతడి రూల్ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు రెడీగా ఉండండి’’ అని పుష్ప 2 టీమ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇందులో బన్నీ లుక్ హైలెట్ గా నిలిచింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెయిటింగ్’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పుష్ప 2కు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా సాంగ్స్ యూట్యూబ్ లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
పుష్ప 2 లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సీక్వెల్ లో ఆమె పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ మధ్య నడిచే యాక్షన్ డ్రామా మరో లెవెల్ లో ఉంటుందని టాక్. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. కాగా మొదటి పార్ట్ కంటే మించి ఉండేలా సుమారు రూ. 500 కోట్లతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ . త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
ఇవి కూడా చదవండి
𝟏𝟎𝟎 𝑫𝑨𝒀𝑺 𝑻𝑶 𝑮𝑶 for #Pushpa2TheRule 💥💥
Get ready for an ICONIC box office experience ❤️🔥
THE RULE IN CINEMAS on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries @PushpaMovie pic.twitter.com/wATfbJAkig
— Pushpa (@PushpaMovie) August 28, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]