Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కాస్ట్లీ ప్రాపర్టీ అమ్మేసిన పూరి జగన్నాథ్.?

[ad_1]
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఇటీవలే వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత పూరి హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పూరి ఫ్యాన్స్ ఈ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు కూడా.. సినిమా విడుదలకు ముందు కుమ్మేస్తుంది.. ఆగ్ లాగాదేంగే అన్నారు. తీరా సినిమా బెడిసికొట్టింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీసుకొచ్చారు. రామ్ పోతినేని హీరోగా చేసిన ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించారు.
ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీహిట్ అందుకుంటుందని అంతా అనుకున్నారు కానీ ఇది కూడా బెడిసి కొట్టింది. అయితే ఈ సినిమా కారణంగా ఇప్పుడు పూరిజగన్నాథ్ ఓ ప్రోపర్టీని అమ్ముకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో డిస్టిబ్యూటర్స్ నష్టాలు వచ్చాయట. దాంతో ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చే పనిలో పడ్డారట పూరిజగన్నాథ్.
ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
ఈ సినిమాతో అప్పులు మరింత పెరగడంతో ఇప్పుడు పూరి ఓ ప్రోపర్టీని అమ్మేశారని తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ విలువైన ప్రాపర్టీని పూరి అమ్మేశాడని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ‘డబుల్ ఇస్మార్ట్’కు ముందు పూరి ఆఫీస్ లో పెద్ద పంచాయితీ జరిగిందట. గతంలో పూరి క్లియర్ చేయాలనీ రచ్చ జరిగిందట. దాంతో శంషాబాద్‌లోని ప్రాపర్టీని అప్పటికప్పుడు రూ.18 కోట్లకు అమ్మేయాల్సివచ్చిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు అప్పులు మరింత పెరిగాయని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ నైజాంలో విడుదల చేసిన నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయాడట. దాంతో ఇప్పుడు పూరి ఆ అప్పులను కూడా క్లియర్ చేయాలి. దాంతో ఇప్పుడు పూరిజగన్నాథ్ ఈ అప్పును క్లియర్ చేయడానికి మరో ప్రోపర్టీ తాకట్టుపెట్టడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]
Source link