Trending news

Prabhas-Vikram: ప్రభాస్ అభిమానుల మనసు గెలుచుకున్న విక్రమ్ చియాన్.. డార్లింగ్ గురించి ఏమాన్నారంటే..

[ad_1]

Prabhas-Vikram: ప్రభాస్ అభిమానుల మనసు గెలుచుకున్న విక్రమ్ చియాన్.. డార్లింగ్ గురించి ఏమాన్నారంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సునామి సృష్టించారు. ఈ మూవీతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ప్రభాస్ కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో అభిమానులను నిరాశపరిచిన డార్లింగ్.. ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడి సినిమాతో సంచనలం క్రియేట్ చేశాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ప్రభాస్ గురించి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విక్రమ్ మాట్లాడుతూ.. “ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అతడిని తెలుగు హీరో అనడం సరికాదు” అని అన్నారు. ఇక మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ప్రభాస్ జోడిగా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని.. భాషపరంగా సినిమా సరిహద్దులను తొలగించారని అన్నారు. ఆయన నటించిన సినిమాలపై అడియన్స్ చూపే అభిమానం చూస్తే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. రాజాసాబ్ మూవీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్ అని తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. కోలీవుడ్ స్టార్ విక్రమ్ తమ హీరో గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ఇటీవలే తంగలాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్రమ్. డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చి మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అలాగే పార్వతి తిరువోతు కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ప్రభాస్ కొత్త ప్రాజెక్టు లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close