Prabhas – Spirit: స్పిరిట్ మూవీ సంగతేంటి.? డార్లింగ్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.!

[ad_1]
కల్కి 2898 ఏడీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్, నెక్ట్స్ సినిమాల లైనప్‌ను మార్చేశారు. ఆల్రెడీ ప్రకటించిన సినిమాలను కాస్త వెనక్కి నెట్టి కొత్త ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువచ్చారు.
దీంతో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావటం కాస్త ఆలస్యం కానుంది. కల్కి 2898 ఏడీ సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్.
ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో స్పిరిట్ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ యూనిఫామ్‌లో కనిపించబోతున్నారంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశారు సందీప్.
యానిమల్ రిలీజ్ తరువాత నెక్ట్స్ స్పిరిట్ మూవీనే పట్టాలెక్కిస్తానని చెప్పిన సందీప్, స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో రాజాసాబ్ తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
కానీ సడన్‌గా ఈ లైనప్ మారిపోయింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో ఈ గ్యాప్‌లో మరో మూవీని పట్టాలెక్కించారు డార్లింగ్.
హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాను లైన్లో పెట్టారు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన స్పిరిట్‌ను నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ చేశారు డార్లింగ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో స్పిరిట్‌ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు.
[ad_2]