Prabhas: రాజాసాబ్ లేటెస్ట్ అప్‌డేట్.. టీజర్ వచ్చేది ఆ రోజే.?

[ad_1]
ప్రభాస్.. ఇప్పుడీ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తోంది. బాహుబలితో మొదలై, కల్కితో పీక్స్‌కి చేరింది. దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ గల నటుల్లో ప్రభాస్ ఏకంగా మొదటి స్థానంలో నిలిచారు. దీంతో ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాల్సిందే. రూ. వెయ్యి కోట్ల ఫిగర్‌ను అవలీలగా దాటేస్తాయి ప్రభాస్ చిత్రాలు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తుండడం, హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న గ్లింప్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ సమయంలో ప్రభాస్ ఎలా ఉన్నారో, అలాంటి లుక్‌లో ఆకట్టుకున్నారు. కల్కి, సలార్‌లో పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించినా ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ లుక్‌లోకి వచ్చేశాడు.
దీంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వైరల్ అవుతోంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
రాజాసాబ్ గ్లింప్స్..
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం.. కల్కి2, సలార్2, రాజాసాబ్, స్పిరిట్‌తో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా 5 చిత్రాలు ఉన్నాయి. ఏ లెక్కన చూసుకున్నా వచ్చే 5 ఏళ్లకు సరిపడ చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారన్నమాట. మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్న ప్రభాస్.. ఈ చిత్రాలతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]