Trending news

Poonam Kaur: అల్లు vs మెగా రచ్చ.. అల్లు అర్జున్ కి పూనమ్ మద్దతు

[ad_1]

  • అల్లు vs మెగా రచ్చ

  • అల్లు అర్జున్ కి పూనమ్ మద్దతు

  • ప్రేమ పంచుతూనే వారి కోసం ప్రార్థిస్తున్నానన్న పూనమ్
Poonam Kaur: అల్లు vs మెగా రచ్చ.. అల్లు అర్జున్ కి పూనమ్ మద్దతు

Poonam Kaur Tweets in Support of Allu Arjun : ఎన్నికల తర్వాత సద్దుమణిగింది అనుకున్న అల్లు వర్సెస్ మెగా క్యాంప్ వివాదం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ తర్వాత మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కడికైనా తనకు ఇష్టమైతేనే వస్తానని తనకి ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు మెగా అభిమానులే తనకి అండగా ఉన్నారని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం తన అభిమానుల కోసమే హీరో అయినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ వినిపించాయి. వాటికి ఊతం ఇచ్చేలాగా నిన్నటికి నిన్న జనసేన ఎమ్మెల్యే ఒకరు అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు.

Samantha: ఆ వింత భామతో సమంత స్నేహం!!

ఇక ఇదంతా కొనసాగుతున్న సమయంలో పూనమ్ కౌర్, అల్లు అర్జున్ కి మద్దతు పలికేలా ఒక ట్వీట్ చేసింది. ఏదో మ్యాచ్లో అల్లు అర్జున్ స్నేహ దంపతుల పక్కనే కూర్చున్న పూనమ్ కౌర్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి లవ్, ప్రేయర్స్ అండ్ హార్మోని అంటూ రాసుకొచ్చింది. అంటే అల్లు అర్జున్ కి ప్రేమ పంచుతూనే వారి కోసం ప్రార్థిస్తున్నానంటూ ఆమె రాసుకొచ్చింది.. ఒకరకంగా చెప్పాలంటే మెగా వర్సెస్ అల్లు అనేది పేరుకే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగానే సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఇప్పుడు పూనం కౌర్ అల్లు అర్జున్ కి మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్ ఇటు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close