Trending news

Polala Amavasya 2024: వార్నీ ఇదెక్కడి విడ్డూరం..! ఎడ్లకు బదులు ట్రాక్టర్లతో పొలాల పండగ..

[ad_1]

అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు రైతులు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో బసవ న్నలను ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఎడ్లతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించారు. కానీ, నిర్మల్‌ జిల్లాలోని లోకేశ్వరం మండలంలో పొలాల పండుగను వినూత్నం గా జరుపుకున్నారు రైతులు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో అభివృద్ధి చెందిన ఈ రోజులలో లోకేశ్వరం మండలం రైతులు పలువురు ఎక్కడా చూడని రీతిలో ఈ పండుగ నిర్వహించారు. పోలాల అమావాస్య పండగ కు రైతులు తమ ఎద్దులను అలంకరించి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రదక్షణ కొరకు తీసుకువచ్చేవారు. కానీ, ఇప్పుడు ఎద్దులకు బదులు ట్రాక్టర్లను అలంకరించి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేయించారు రైతులు. ఈ వింత ఘటనను చూసి పలువురు అచ్చర్యపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close