Trending news

PM Modi Singapore Tour: సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..

[ad_1]

  • సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్‌
  • బ్రూనై దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..

  • సెప్టెంబర్‌ 3–4 తేదీల్లో భారత్- బ్రూనై దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చ..

  • సెప్టెంబర్‌ 4–5 తేదీల్లో సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో భేటీకానున్న ప్రధాని మోడీ
PM Modi Singapore Tour: సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..

PM Modi Singapore Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్‌, బ్రూనై దేశాల్లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకం కానుంది అని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 3, 4వ తేదీల్లో ప్రధాని మోడీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొట్ట మొదటిసారని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు వెల్లడించారు. బ్రూనై నుంచి ప్రధాని మోడీ సెప్టెంబర్‌ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌కు వెళ్లనున్నారు.. సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ ఆహ్వానం మేరకు మోడీ ఈ పర్యటన కొనసాగనుంది.

Read Also: Hyderabad Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

అయితే, ఆగస్టు 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశం- సింగపూర్ రెండవ మంత్రుల సంభాషణ (ISMR) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో డిజిటల్, స్కిల్ డెవలప్‌మెంట్, సస్టైనబిలిటీ, హెల్త్‌కేర్, కనెక్టివిటీతో పాటు అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో రెండు దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close