PM Modi: శుక్రవారం మహారాష్ట్రలో మోడీ పర్యటన.. ముంబై జీఎఫ్ఎఫ్ సదస్సులో ప్రసంగం

[ad_1]
- శుక్రవారం మహారాష్ట్రలో మోడీ పర్యటన
-
ముంబై జీఎఫ్ఎఫ్ సదస్సులో ప్రసంగం

ప్రధాని మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు ప్రధాని పర్యటన ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగేశాయి. నువ్వానేనా? అన్నట్టుగా ఇరుపక్షాల కూటమిలు తలపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం..
పర్యటనలో భాగంగా పాల్ఘర్, ముంబైలో మోడీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2024లో ప్రధాని ప్రసంగించనున్నారు. ఆయా రంగాలకు చెందిన 800 మంది వక్తులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 350 మంది వరకు ఈ సెషన్‌లో ప్రసంగిస్తారు. ఇక్కడ సరికొత్త ఆవిష్కరణలు కూడా ప్రదర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30కి పాల్ఘర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: YVS: 80స్ బ్యాక్ డ్రాప్ లో వైవిఎస్ చౌదరి-నందమూరి తారక రామారావు సినిమా
[ad_2]