Plastic Utensils: ప్లాస్టిక్ పాత్రలపై మరకలు వదలడం లేదా.. ఈ చిట్కాలతో సులభంగా పోతాయి..

[ad_1]
ప్లాస్టిక్ వస్తువులు కూడా మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇళ్లలో అనేక రకాలైన ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అవి పగిలి పోయేంత వరకు ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ ఉంటారు. కానీ ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించకూడదన్న విషయం తెలిసిందే. అయితే ప్లాస్టిక్‌లో కూడా భూమిలో త్వరగా కరిగిపోయే హై క్వాలిటీవి ఉంటాయి. వీటిని ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువులపై కూడా ఒక్కోసారి మరకలు పడుతూ ఉంటాయి. వీటిని పోగొట్టాలంటే చాలా కష్టంగా మారుతుంది. కానీ ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలతో మనం వీటిపై పడ్డ మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
హ్యాండ్ శానిటైజర్:
కరోనా వచ్చిన తర్వాత నుంచి చాలా మంది ఇప్పటికీ హ్యాండ్ శానిటైజర్స్ ఉపయోగిస్తూ ఉంటున్నారు. వీటిని వాడటం మంచిదే. అయితే వీటితో ప్లాస్టిక్ వస్తువులపై పడ్డ మరకల్ని ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక గంట సేపు శానిటైజర్ కలిపిన గోరు వెచ్చటి నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత సబ్బుతో రుద్ది కడగాలి. ఇలా చేస్తే ప్లాస్టిక్ వస్తువులపై పడ్డ మరకలు ఈజీగానే పోతాయి.
ఉప్పు – నిమ్మరసం:
ఉప్పు, నిమ్మరసంతో పాటు కూడా ప్లాస్టిక్ పాత్రలపై పడ్డ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. ముందుగా మరకలు ఉన్నచోట ఉప్పు రాసి.. స్క్రైబ్ చేయాలి. ఒకసారి కడిగి.. ఆ తర్వాత నిమ్మరసంతో రుద్దాలి. ఇలా ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇలా చేస్తే ప్లాస్టిక్ పాత్రలపై పడ్డ మరకలు తొలగిపోతాయి. నిమ్మ రసం మరకలను తొలగించడంలో సహజమైన బ్లీచింగ్‌లా పని చేస్తుంది. కాబట్టి మరకలు పోతాయి.
ఇవి కూడా చదవండి
క్లోరిన్ బీచ్:
క్లోరిన్ బీచ్ సహాయంతో కూడా ప్లాస్టిక్ వస్తువలపై పడ్డ మరకల్ని ఈజీగా తొలగించుకోవచ్చు. బ్లీచ్ బాగా కఠినంగా ఉంటుంది. కాబట్టి ప్లాస్టి పాత్రలపై పడ్డ మరకలు సులభంగా పోతాయి. బ్లీచ్ వేసి రుద్ది కాసేపు పక్కన పెట్టి.. ఆ తర్వాత శుభ్రమై నీటితో కడిగితే మరకలు అనేవి పోతాయి. ఆ తర్వాత మంచి నీటితో ఓ రెండు, సార్లు వాసన పోయేంత వరకు రుద్ది కడగండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]