Perni Nani: ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

[ad_1]

Perni Nani: జగన్‌ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ ఆషాఢ భూతి అని.. నమ్ముకున్న వాళ్లను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని ఆషాఢ భూతి అంటారని ఆయన అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ, ప్రకాశం, బెజవాడలో కార్పొరేటర్లు, మేయర్లు రాజీనామా చేయకుండా ఎలా కండువా కప్పుకున్నారని ప్రశ్నలు గుప్పించారు.
Read Also: Minister Nara Lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!
టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదన్నారు. ఎన్నికల్లో ఓటమి వల్ల ఆ పార్టీ పని అయిపోదన్నారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్ట్ ద్వారానే ప్రభుత్వం ఏర్పాటు చేశారని.. చంద్రబాబుకి ఎవరో ఒకరు సాయం ఉంటే తప్ప గెలవటం కుదరదని విమర్శించారు. జగన్‌కు పార్టీ మారే ఇలాంటి నేతలు అవసరం లేదని, జనం ఉంటే జగన్‌కు చాలన్నారు. జగన్ పదవి ఇచ్చిన వాళ్ళని మాత్రమే చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. 2029లో టీడీపీపై ప్రజల తిరుగు బాటు ఉంటుందని జోస్యం చెప్పారు పేర్ని నాని.. రాజీనామాల తర్వాత సతీష్, రాజేష్ అనే వారు రాజ్యసభలోకి వస్తున్నారనే విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఈ రాజీనామాలు, కొనుగోళ్ల డ్రామాలు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసని పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలేదన్నారు.
హోం మంత్రి అనితపై పేర్ని నాని పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఆ శాఖ మంత్రి స్పందించరని విమర్శించారు. రాజకీయంగా మాత్రం తగుదునమ్మా అని మాట్లాడతారని ఎద్దేవా చేశారు. జగన్ విషయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఆ మంత్రి మానుకోవాలన్నారు. మంత్రిగా ఉన్నామనే విషయం తెలుసుకుని మాట్లాడాలన్నారు. 2013లో విశాఖ నుంచి వైసీపీ కార్పొరేటర్ టికెట్ అడిగిన విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు.
[ad_2]