Trending news

Pawan Kalyan: రావడం లేటవచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..

[ad_1]

Pawan Kalyan: రావడం లేటవచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..

కొన్ని సార్లు రావడం లేటవచ్చు.. కానీ రావడం పక్కా.. ఒకప్పుడు రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయ నాయకుడు. పార్టీ పెట్టి అప్పటికే ఐదారేళ్లయింది..కేడర్‌ బలంగా లేదు. పార్టీకి పునాది అంతగా లేదు. ప్రత్యర్ధుల విమర్శలు.. అయినా వెనకడుగు వేయలేదు. ఎంత కచ్చిగా తనపై విమర్శనాస్త్రాలు సంధించారో..అంత కసిగా రాజకీయాల్లో రాటుదేలారు. జనసేన స్థాపించిన దాదాపు పదేళ్ల తర్వాత.. అంటే.. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ తీసుకున్నరాజకీయ వ్యూహాలు అనూహ్యం.. తాను తగ్గినా పార్టీని గెలవాలన్న సంకల్పంతో పొత్తు వైపు అడుగులు వేశారు. ఆ పొత్తుకోసం ఎన్నో కసరత్తులు చేశారు.. చివరకు పార్టీ వందకు వందశాతం విజయం సాధించేలా చేశారు.. అంతేకాకుండా.. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించి.. ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు.. జాతీయ స్థాయిలోనే సంచలనంగా మారారు..

అదే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పవర్.. లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట. నాడు ఓటమితో కుంగిపోలేదు..నేడు గెలుపుతో పొంగిపోలేదు.. పవన్ కల్యాణ్ నడిచింది రహదారి కాదు ముళ్లదారి. అలాంటి దారిలో నెగ్గి చూపించారు. జనసేన పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది..

ఇది కూడా చదవండి..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

[ad_2]

Related Articles

Back to top button
Close
Close