Trending news

Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజభోగాలు.. ఒకరు కాళ్లు.. ఇంకొకరు చేతులు.. ఈ పిల్లలను గుర్తు పట్టారా?

[ad_1]

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 02) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. ఈక్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేస్తూ పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ దర్జాగా సోఫాలో కూర్చొని పిల్లలకు ఆశీస్సులు ఇస్తున్నట్టు పోజు ఇచ్చారు. ఇక వరుణ్ తేజ్ బాబాయి కాళ్లు పట్టాడు. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేతులు నొక్కుతున్నట్టు పోజులు ఇచ్చారు. ఇక ఇదే ఫొటోలో వెనకాల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏదో పని చేస్తున్నట్టుగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోను చూస్తూ చాలా మంది నెటిజన్లు ‘నవ్వు ఆపుకోలేకపోతున్నాం’ అంటున్నారు.

టీనేజ్ టైంలో పవన్ కల్యాణ్ ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారట. చిరంజీవి, నాగబాబు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోన్న సమయంలో పవన్ మాత్రం ఇంట్లో పిల్లలతోనే ఎక్కువగా గడిపేవాడట . శ్రీజ, సుష్మిత, రామ్ చరణ్‌, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో ఆడుకుంటూ ఉండేవాడట. అందుకే వీరికి పవన్ కల్యాణ్ అంటే ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ తమ తమ బాల్యాన్ని పవన్ తోనే ఎక్కువగా గడిపారు. తాజాగా వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫొటోను చూస్తుంటే చిరంజీవి, నాగబాబు పిల్లలతో పవన్ ఎంత జోవియల్ గా ఉండేవారో ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో మెగాభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్తకర్తలను బాగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫొటో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close