Trending news

Pawan Kalyan: కళ్యాణ్ బాబు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మెగాస్టర్

[ad_1]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు.. నిన్న మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు పవన్. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసున్న ఓ బ్యూటీ ఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు.

ఇప్పుడు చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ” అని రాసుకొచ్చారు చిరంజీవి. ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులు తీ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close