Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం.. డిస్కస్ త్రో F56లో రజతం

[ad_1]
- పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం
-
పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేష్ కథునియాకు రజతం -
42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన.

పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేష్ కథునియా రజత పతకం గెలుచుకున్నాడు. 42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
Read Also: The Deal: హీరోగా మారుతున్న ప్రభాస్ ఫ్రెండ్!!
టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన కథునియా.. తన మొదటి ప్రయత్నంలోనే డిస్కస్‌ను 42.22 మీటర్లకు విసిరాడు. కాగా.. బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బాటిస్టా డాస్ శాంటోస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. తన ఐదవ ప్రయత్నంలో 46.86 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. గ్రీస్‌కు చెందిన కాన్‌స్టాంటినోస్ జౌనిస్ 41.32 మీటర్లతో కాంస్యం గెలుపొందాడు. ఈ రజత పతకంతో భారత్ మరో పతకం సాధించింది. కాగా.. పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా ఎనిమిది పతకాలు సాధించింది.
Read Also: Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
[ad_2]