Paralympics 2024: భారత్‌కు మరో బంగారు పతకం.. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్

[ad_1]
- పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం
-
స్వర్ణ పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ -
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో పతకం కాగా.. రెండో బంగారు పతకం.

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో జరిగిన పతక పోరులో.. బ్రిటీష్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ డేనియల్ బెతెల్‌ను 21-14, 18-21, 23-21 స్కోరుతో ఓడించాడు.
Read Also: Daisuke Hori: 12 ఏళ్లుగా.. రోజుకు 30 నిమిషాలే నిద్ర.. ఫిట్ నెస్ మాత్రం అదుర్స్..
కాగా.. ఈ మ్యాచ్‌లో తొలి సెట్ ను నితీశ్ 21-14 తేడాతో కైవసం చేసుకోగా, రెండో సెట్ లో వెనుకబడ్డాడు. ప్రత్యర్థి బెతెల్ గేమ్‌ను 18–21తో ముందంజలో ఉన్నాడు. మూడో సెట్ లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య చాలా గట్టి పోటీ నడిచింది. ఒక దశలో స్కోరు 20-20కి చేరుకుంది. అయితే నితీశ్ చివర్లో అద్భుత ప్రదర్శన చేసి 23-21తో గేమ్‌ను గెలుచుకున్నాడు. దీంతో.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Read Also: 31 Trains Cancelled: మరో 31 రైళ్లు రద్దు.. 13 రైళ్లు దారి మళ్లింపు..
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో పతకం కాగా.. రెండో బంగారు పతకం. నితేష్ కంటే ముందు మహిళా షూటర్ అవనీ లేఖా కూడా స్వర్ణం గెలుపొందింది.
[ad_2]