Paralympics 2024: పారాలింపిక్లో భారత్‌కు స్వర్ణం.. షూటింగ్‌లో మెరిసిన అవని..

[ad_1]
- ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం..
-
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అవనికి స్వర్ణం.. -
10 మీ. ఎయిర్‌పిస్టల్ విభాగంలో మోనా అగర్వాకు కాంస్యం.. -
ఒకే ఈవెంట్‌లో ఇద్దరు భారతీయులకు పతకాలు..

Paralympics 2024: ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్-2024లో భారత్ పతకాల ఓపెన్ చేసింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్థానంలో అవని నిలిచి.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, పారాలింపిక్స్‌లో అవనీ లేఖరాకి ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. ఇంతకు ముందు, టోక్యో పారాలింపిక్స్-2021లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 22 ఏళ్ల అవని పసిడి పతకం కైవసం చేసుకుంది.
Read Also: CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన.. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ముఖ్యమంత్రి
ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను అవని లేఖరా తన పేరిట లిఖించుకుంది. పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక, ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్- 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకంతో సరి పెట్టుకుంది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ సాధించింది.
🇮🇳🥇 UNSTOPPABLE! The defending champion Avani Lekhara clinches gold at the Paris Paralympics 2024, proving she’s still on top!
📷 Pics belong to the respective owners • #AvaniLekhara #Shooting #ParaShooting #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/advcNuWvYR
— The Bharat Army (@thebharatarmy) August 30, 2024
[ad_2]