Trending news

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా.. పతక విజేతల పూర్తి జాబితా ఇదే!

[ad_1]

  • రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు
  • పారాలింపిక్స్‌లో 12 విభాగాల్లో భారత్ పోటీ
  • నేటివరకు 15 పతకాలు
Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా.. పతక విజేతల పూర్తి జాబితా ఇదే!

India Medals 15 Winners List: ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్న 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పారాలింపిక్స్‌లో 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ హవా కోనసాగుతోంది. నేటివరకు 15 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్.. పట్టికలో 15వ స్థానంలో ఉంది. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేడు షూటింగ్‌, షాట్‌పుట్, హైజంప్, జావెలిన్‌త్రో పోటీల్లో పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు.

2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలను గెలుచుకుంది. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో సహా 19 పతకాలను భారత్ ఖాతాలో వేసుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో ఇప్పటికే 15 మెడల్స్ గెలిచి.. రికార్డు పతకాల దిశగా సాగుతోంది. ఈసారి పారా సైక్లింగ్, పారా రోయింగ్ సహా బ్లైండ్ జూడో క్రీడలలో సైతం భారతీయ పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. సోమవారం ప్రదర్శన చేసిన షట్లర్లు ఒకే రోజు నాలుగు పతకాలు అందించారు. డిస్కస్‌ త్రో, ఆర్చరీలో కూడా మెడల్స్ వచ్చాయి. పతక విజేతల పూర్తి జాబితాను ఓసారి చూద్దాం.

పతక విజేతల జాబితా:

1 అవని ​​లేఖా – షూటింగ్ – మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 – స్వర్ణం
2 మోనా అగర్వాల్ – షూటింగ్ – మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 – కాంస్యం
3 ప్రీతి పాల్ – అథ్లెటిక్స్ – మహిళల 100మీ T35 – కాంస్యం
4 మనీష్ నర్వాల్ – షూటింగ్ – పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ SH1 – రజతం
5 రుబీనా ఫ్రాన్సిస్ – షూటింగ్ – మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1 – కాంస్యం
6 ప్రీతి పాల్ – అథ్లెటిక్స్ – మహిళల 200 మీటర్ల T35 – కాంస్యం
7 నిషాద్ కుమార్ – అథ్లెటిక్స్ – పురుషుల హైజంప్ T47 – రజతం
8 యోగేష్ కథునియా – అథ్లెటిక్స్ – పురుషుల డిస్కస్ త్రో F56 – రజతం
9 నితీష్ కుమార్ – బ్యాడ్మింటన్ – పురుషుల సింగిల్స్ SL3 – స్వర్ణం
10 తులసిమతి మురుగేషన్ – బ్యాడ్మింటన్ – మహిళల సింగిల్స్ SU5 – రజతం
11 మనీషా రామదాస్ – బ్యాడ్మింటన్ – మహిళల సింగిల్స్ SU5 – కాంస్యం
12 సుహాస్ యతిరాజ్ – బ్యాడ్మింటన్ – పురుషుల సింగిల్స్ SL4 – రజతం
13 రాకేష్ కుమార్ / శీతల్ దేవి – ఆర్చరీ – మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ – కాంస్యం
14 సుమిత్ యాంటిల్ – అథ్లెటిక్స్ – జావెలిన్ త్రో F64 – స్వర్ణం
15 నిత్య శ్రీ శివన్ – బ్యాడ్మింటన్ – మహిళల సింగిల్స్ SH6 – కాంస్యం

 



[ad_2]

Related Articles

Back to top button
Close
Close