Pakistan: వాఘా బోర్డర్‌లో కాశ్మీర్ వేర్పాటువాది ఫోటో.. ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..

[ad_1]
- కాశ్మీర్‌తో తన ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..
-
వాఘా సరిహద్దు వద్ద కాశ్మీరి వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ ఫోటో.. -
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముందు పాకిస్తాన్ దుష్ట ప్రయత్నం.. -
నిరసన తెలిపిన భారత్..

Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్‌ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు వాఘా-అట్టారి బోర్డర్ వద్ద కాశ్మీర్ వేర్పాటువాద నేత దివంగత సయ్యద్ అలీ షా గిలానీ ఫోటోతో కూడా పెద్ద బోర్డును ఏర్పాటు చేసింది. ఇరు దేశాల ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఫోటో కనిపిస్తోంది.
Read Also: AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ(93) కన్నుమూత
జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరగడం, మరికొన్ని రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఫోటోని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌లోని వాఘా వైపు జాయింట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద జెండా అవతరణ కార్యక్రమం జరిగే ప్రదేశానికి సమీపంలో జిలానీ ఫోటోని ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పాకిస్తాన్ రేంజర్లకు నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేత ఫోటోలను పాకిస్తాన్ తన వైపు ప్రదర్శించిందని, ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ప్రాంతం రాజకీయ ప్రదర్శనకు వేదిక కావద్దని భారత్ సూచించినట్లు తెలిసింది.
ఈ చర్య అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కలుగజేసుకునే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో పేదరికం, ద్రవ్యో్ల్భణం, ఇటీవల బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఏకంగా 70 మంది వరకు పాక్ సైనికులు చనిపోయిన విషయాలను పక్కదారి పట్టించేదుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
[ad_2]