Trending news

OTT Movie: పర్సనల్ వీడియో ఉన్న ల్యాప్‏టాప్ కోసం హీరో కష్టాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

[ad_1]

మలయాళీ స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా నునకుళి. ఇందులో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ ప్రధాన పాత్రలు పోషించగా.. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ థియేటర్లలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. మరోసారి తనదైన కామెడీ యాక్టింగ్ తో ప్రేక్షకులను నవ్వించారు బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోని. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13న తేదీన ఈ మూవీ జీ5లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

అయితే ఈ సినిమా కేవలం మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతుందా.. లేదా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాకు అటు ఓటీటీలోనూ వ్యూస్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బైజూ సంతోష్, నిఖిల విమల్, మనోజ్ కే జయన్, అల్తాఫ్ సలీం, బినూ పప్పు, అజీబ్ నడుమగ్డన్, అజు వర్గీస్ కీలకపాత్రలు పోషించారు. ఆద్యంతం ట్విస్టులతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. పర్సనల్ సీక్రెట్స్ ఉన్న ల్యాప్ టాప్ తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.

కథ విషయానికి వస్తే..
తన తండ్రి మరణించిన తర్వాత ఇబీ జచారియా (బాసిల్ జోసెఫ్) కంపెనీ బాధ్యతలు చేపడతాడు. కానీ కొత్తగా పెళ్లి కావడంతో తన భార్య (నిఖిల విమల్) ధ్యాసలోనే ఉంటాడు. అటు కంపెనీని పట్టించుకోడు. అయితే తన భార్యను ఒప్పించి తమ పర్సనల్ వీడియోను ఓ ల్యాప్ టాప్ లో స్టోర్ చేస్తాడు. అయితే అనుకోకుండా ఓరోజు ఇబీ ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే సదరు ఐటీ ఆఫీసర్ భామకృష్ణన్ (సిద్ధిఖీ) ఆ ల్యాప్ టాప్ సీజ్ చేస్తారు. దీంతో తమ పర్సనల్ వీడియో ఉన్న ఆ ల్యాప్ టాప్ తిరిగి తీసుకురాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది ఇబీ భార్య. ఇక ఆ ల్యా్ప్ టాప్ కోసం రెష్మిత (గ్రేస్ ఆంటోని)తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు ఇబీ. ఈ క్రమంలోనే మరిన్ని చిక్కుల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?ఆ ల్యాప్ టాప్ తిరిగి తీసుకున్నాడా ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close