Trending news

OG : ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

[ad_1]

  • పవన్ కల్యాణ్ ఓజీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

  • మార్చ్ 27న రిలీజ్ అంటూ ప్రచారం

  • సుజీత్ దర్శకత్వంలో ఓజీ
OG : ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG New Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక డై హార్డ్ ఫ్యాన్‌ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు సుజీత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

Also Read: NTR: మా అమ్మ కల నెరవేర్చా.. రిషబ్ శెట్టితో పిక్ షేర్ చేసిన ఎన్టీఆర్

పవన్ కూడా ముందుగా ఓజి సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఓజి రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికైతే.. ఈ సెప్టెంబర్ 27న ఓజి థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో.. ఓజిని వాయిదా వేశారు. ఓజి ప్లేస్‌లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ అవుతోంది. మరి ఓజి రిలీజ్ ఎప్పుడు అంటే? వచ్చే ఏడాదిలో ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 2025 సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

Also Read: Cinema Chettu: సినిమా చెట్టుకు కొత్త చిగురు

లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా దాదాపుగా ఇదే డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఓజి రాక కోసం మరో 7 నెలలు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే ఓజి కొత్త రిలీజ్ డేట్‌ను అధికారకంగా ప్రకటించనున్నారు. కుదిరితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. సెప్టెంబర్ 2 అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నిర్మాత డివివి. దానయ్య.. పవన్ బర్త్ డేకి స్పెషల్ ఓజి నుంచి అప్డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా టాక్ ఉంది. ఇప్పుడు టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది. కాబట్టి ఆ రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close