Trending news

Off The Record about What are the changes in the cadre of YSRCP President Jagan?

[ad_1]

  • 2019లో అధికారంలోకి వచ్చాక జగన్‌కు, కేడర్‌కు మధ్య గ్యాప్‌?..
  • 2024లో కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేయలేదా?..
  • అంతకు ముందు గ్రామ స్థాయిలో కార్యకర్తల అనుసంధానం..
  • వాలంటీర్స్‌ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన సీన్‌..
  • వాలంటీర్స్‌ దెబ్బకు నామ మాత్రంగా వైసీపీ కార్యకర్తలు..
  • గతంలో కేడర్‌ గురించి అరుదుగా మాట్లాడిన జగన్‌..
  • అన్నీ కలగలిసి ఎలక్షన్‌ టైంలో కాడి వదిలేశారా?..
  • రివ్యూ చేసుకున్న అధిష్టానానికి తత్వం బోథపడిందా?..
    నెల్లూరు జిల్లా కార్యకర్తల మీటింగ్‌లో మాటలు అందులో భాగమేనా?..
Off The Record: కేడర్‌ విషయంలో వైసీపీ అధ్యక్షుడిలో వచ్చిన మార్పేంటి..?

Off The Record: వైఎస్సార్‌ కాంగ్రెస్‌.. మాస్‌ కాదు.. ఊర మాస్‌ ఇమేజ్‌ ఉన్న పార్టీ. దాదాపు ప్రతి చర్య, కార్యక్రమం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. అలాగే… పార్టీ కేడర్‌కు కూడా తమ అధినేత జగన్‌ అంటే పిచ్చి. అది ఎంతలా అంటే… చేసింది తప్పా, ఒప్పా అన్న దాంతో సంబంధం లేదు. జగనన్న చేశాడంటే… చెప్పాడంటే… అది కచ్చితంగా కరెక్ట్‌ అనుకునేంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రేంజ్‌లో ఉన్న ఫీలింగ్‌… 2019లో పార్టీకి పవర్‌ వచ్చాక కాస్త తగ్గిందన్న అభిప్రాయం ఏర్పడింది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కారణాలు ఏవైనా.. 2024 ఎన్నికల్లో కార్యకర్తలంతా వంద శాతం మనస్ఫూర్తిగా పని చేయలేదని, ఆ ఎఫెక్ట్‌ గట్టిగానే కొట్టిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానంగా గ్రామ స్థాయిలో కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించేవారు. కానీ.. అధికారంలోకి వచ్చాక వాలంటీర్స్‌ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. పార్టీ కార్యకర్తలకు పనిలేకుండా పోవడంతో పాటు ప్రతి యాభై ఇళ్ళకు ఓ వాలంటీర్‌ను పెట్టడంతో… గవర్నమెంట్‌ పథకాల అమలు సహా ఇతర పెత్తనమంతా.. వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. దాంతో కేడర్‌కు విలువ లేకుండా పోగా… నామ మాత్రంగా మిగిలిపోయారన్న అభిప్రాయం ఉంది. ఆ అసంతృప్తి, అసహనంతోనే… ఎన్నికల టైంలో వాళ్ళు మనస్ఫూర్తిగా పని చేయలేదని కాస్త ఆలస్యంగా గ్రహించిందట వైసీపీ అధిష్టానం.

Read Also: CS Vijayanand: ప్రభుత్వ శాఖ‌లకు ఆర్టీజీఎస్ సాంకేతిక స‌హ‌కారం.. త్వరలో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌

అధికారంలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నాయకులకు దిశా నిర్దేశం చేసిన జగన్‌.. ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించే ఎక్కువగా మాట్లాడేవారు తప్ప…కార్యకర్తల టాపిక్‌ చాలా అరుదుగా వచ్చేది. అలా అన్నీ కలగలిసి ఎన్నికల్లో వారు కాడి వదిలేయటం వల్లే భారీ డ్యామేజ్ జరిగిందని పార్టీ పోస్ట్‌మార్టంలో తేలిందట. అందుకే ఇప్పుడు అధినేత స్వరం మారినట్టు చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. దానికి తోడు ప్రతిపక్షంలోకి వచ్చాక కార్యకర్తలపై కేసులు కూడా పెరిగాయి. దీంతో… ఓసారి రివ్యూ చేసుకున్న అధిష్టానం కేడర్‌కు అండగా నిలవాలని డిసైడైందన్నది పార్టీ వర్గాల లేటెస్ట్‌ టాక్‌. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేయటం అందులో భాగమేనంటున్నారు. కేడర్‌ని ఇన్నాళ్ళు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తామని ఆ మీటింగ్‌లో అన్న మాటలపై ఇప్పుడు గట్టి చర్చే జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారాయన.

Read Also: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్‌లో బంగ్లాదేశ్..

అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న వారిని గుర్తు పెట్టుకోండని చెబుతూ.. కచ్చితంగా అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు జగన్‌. ఆ సమావేశంలో స్పీచ్ విన్న పార్టీ నేతలంతా… ఇది కదా ఇన్నాళ్ళుగా మేం కోరుకుంటున్నది. ఆ భరోసా కోసమే కదా వేచి చూసింది అని మాట్లాడుకుంటున్నారట. మొత్తంగా నెల్లూరు రివ్యూ మీటింగ్‌లో జగన్‌ అన్న మాటలు… కార్యకర్తలకు బూస్ట్‌ ఇస్తున్నాయన్నది వైసీపీలో లేటెస్ట్‌ టాక్‌. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌… కార్యకర్తల సంగతి తర్వాత… చివరికి ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండరని చెప్పుకునేవారు. కానీ… దెబ్బ తగిలాక వివరం తెలిసి వచ్చిందని, మా అధ్యక్షుడు ఈ మాటలకు కట్టుబడి ఉంటే… మేం ఎంత దూరమైనా వెళ్తామని అంటున్నారట వైసీపీ కార్యకర్తలు. మార్పు మంచిదే అయినా… అమలు ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close