No ODI Century: వన్డే క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేని దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసా..?

[ad_1]
- వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.
- సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ బద్దలు.
- క్రికెట్ కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సీనియర్ ఆటగాళ్ల గురించి..

No ODI Century: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అని అందరూ చెబుతారు. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 295 మ్యాచ్‌ల్లోనే 50 సెంచరీలు సాధించాడు. ఇక క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇకపోతే తమ క్రికెట్ కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సీనియర్ ఆటగాళ్ల గురించి ఓసారి చూద్దామా..
గ్రాహం థోర్ప్ (Graham Thorpe):
ఇంగ్లండ్‌కు చెందిన మాజీ స్టార్ బ్యాట్స్మెన్ గ్రాహం థోర్ప్ తన వన్డే కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను 1993 సంవత్సరంలో తన మొదటి మ్యాచ్ ఆడాడు. అతను చివరిసారిగా 2005లో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆయన 162 మ్యాచ్‌ల్లో 149 ఇన్నింగ్స్‌లలో 31 సార్లు నాటౌట్‌గా ఉండి 5122 పరుగులు చేశాడు. అతని సగటు 43.40. ఆయనకు మొత్తం 42 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ ఒక్కసారి కూడా సెంచరీ చేయలేకపోయాడు. అతని అత్యుత్తమ స్కోరు 96 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు.
మైఖేల్ వాఘన్ (Michael Vaughan):
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ 2001లో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అతను చివరిసారిగా 2007లో వన్డే మ్యాచ్ ఆడాడు. అతను 86 మ్యాచ్‌ల్లో 83 ఇన్నింగ్స్‌ల్లో 1,982 పరుగులు సాధించగా.. 10 సార్లు నాటౌట్ గా నిలిచాడు. అతని సగటు 27.15. వాన్ 16 అర్ధ సెంచరీలు సాధించగా., అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతని అత్యుత్తమ స్కోరు 90 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు.
మిస్బా ఉల్ హక్ (Misbah ul Haq):
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ మిస్బా-ఉల్-హక్ 2002లో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అతను చివరిసారిగా 2015లో ఆడాడు. మిస్బా తన వన్డే కెరీర్‌లో 162 మ్యాచ్‌లు ఆడాడు. అతని 149 ఇన్నింగ్స్‌లలో 31 సార్లు నాటౌట్‌గా ఉండి 5122 పరుగులను చేసాడు చేశాడు. అతని సగటు 43. తన బ్యాట్‌తో 42 అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ., అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతని అత్యుత్తమ స్కోరు 96 చేసి నాట్ అవుట్ గా నిలిచారు.
దినేష్ కార్తీక్ (Dinesh Karthik):
ఇక ఈ లిస్ట్ లో భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా ఉన్నాడు. ఆయన 2004లో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అతను చివరిసారిగా 2019లో వన్డే మ్యాచ్ ఆడాడు. అతని 15 ఏళ్ల సుదీర్ఘ ODI కెరీర్ లో కార్తీక్ 94 మ్యాచ్‌లు ఆడాడు. 30.2 సగటుతో 79 ఇన్నింగ్స్‌లలో 1,752 పరుగులు చేశాడు. అతను తన బ్యాట్ తో 9 అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతని అత్యుత్తమ స్కోరు 79 పరుగులు మాత్రమే.
[ad_2]