Trending news

Nitish Kumar: 15 ఏళ్ల వయసులో కాలు కోల్పోయి.. స్వర్ణ విజేత నితీష్ కుమార్ కథ

[ad_1]

  • పారాలింపిక్స్ 2024లో భారత్ కు మరో బంగారు పతకం
  • స్వర్ణ విజేత నితీష్ కుమార్
  • 15 ఏళ్ల వయసులో ప్రమాదంలో కాలు కోల్పోయిన నితీష్ కథ ఇదే..
Nitish Kumar: 15 ఏళ్ల వయసులో కాలు కోల్పోయి.. స్వర్ణ విజేత నితీష్ కుమార్ కథ

పారాలింపిక్స్ 2024లో బంగారు పతకం సాధించడం ద్వారా నితీష్ కుమార్ తన కలను నెరవేర్చుకున్నాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. నితీష్ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 8 పతకాలు చేరాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ 22వ స్థానానికి చేరుకుంది. ఈ గేమ్స్‌లో భారత్ ప్లేయర్స్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించారు. పారా షూటర్ అవనీ లేఖరా పారాలింపిక్ గేమ్స్ 2024లో భారత్‌కు తొలి స్వర్ణం అందించింది.

READ MORE: Kolkata Doctor Case: ఒక్క వ్యక్తి 41 మంది పోలీసుల్ని గాయపరిచాడా..? మమతా సర్కార్ పరువు పాయే..

పారాలింపిక్ గేమ్స్ 2024లో పురుషుల SL-3 విభాగంలో నితీష్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌ను ఓడించాడు. నితీష్ కుమార్, డేనియల్ బేతాల్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీలో ఒక్కో పాయింట్ కోసం గట్టిపోటీ నెలకొంది. చివరికి ఈ మ్యాచ్‌ 21-14, 18-21, 23-21తో నితీష్‌ కుమార్‌ కైవసం చేసుకున్నాడు. డేనియల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.

READ MORE:Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ

15 ఏళ్ల వయసులో ప్రమాదంలో కాలు కోల్పోయిన నితీష్ కుమార్ పారాలింపిక్స్‌లో అద్భుతం సాధించాడు. కానీ ఈ విజయం సాధించడం వెనుక అతను ఎదుర్కొన్న పోరాటం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నితీష్‌కు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, 2009లో రైలు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. చాలా కాలం మంచానికే పరిమితమయ్యాడు. తన తండ్రి నేవీలో అధికారి. తన తండ్రిలాగే నేవీ యూనిఫాం ధరించాలన్నది నితీష్ కల. కానీ ఓ ప్రమాదం అతని కలను విచ్ఛిన్నం చేసింది.

READ MORE:Special Officers For Flood Affected Areas: వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులు.. విజయవాడలో వీరిని సంప్రదించండి..

కానీ నితీష్ ఓడిపోలేదు. కష్టాలపై పోరాడారు. అలాగే చదువు పూర్తి చేశాడు. ఐఐటీ-మండిలో చదువుతున్నప్పుడు పారా బ్యాడ్మింటన్ గురించిన సమాచారం వచ్చింది. అప్పుడు ఈ ఆట అతని బలానికి మూలమైంది. ఈ రోజు ఈ గేమ్ అతని పేరును దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేసింది. నితీష్ కుమార్ విజయంతో, ఎస్ఎల్ 3 (SL3) విభాగంలో స్వర్ణ పతకం భారత్‌కు దక్కింది. టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్ భగత్ ఈ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close