New Zealand: న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ తర్వాత..!

[ad_1]
- న్యూజిలాండ్ ఉమెన్స్ టీ20 జట్టు సారథి సోఫీ డివైస్ కీలక నిర్ణయం..
-
టీ20 వరల్డ్ కప్ తర్వత కెప్టె్న్సీకి వీడ్కోలు చెప్తానని వెల్లడి.. -
వన్డేలో మాత్రం కెప్టెన్ గా కొనసాగుతాను: కివీస్ సారథి సోఫీ డివైస్

New Zealand: న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక సంచలన తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనట్లు ప్రకటించింది. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగనన్నట్లు వెల్లడించింది. తన వర్క్‌లోడ్‌ను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. కాగా సోఫీ డివైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా రన్స్చేసిన రెండువ మహిళ క్రికెటర్‌గా సోఫీ ప్రస్తుతం కొనసాగుతున్నారు.
Read Also: Weather Alert: గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్
కాగా, కివీస్ ఉమెన్స్ టీ20 కెప్టెన్ సోఫీ డివైన్ ఇప్పటి వరకు 135 టీ20లు ఆడి 3268 రన్స్ చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రంలో తన మార్క్‌ను చూపించలేకపోతుంది. తన సారథ్యంలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ 56 టీ20 మ్యాచ్ లు ఆడగా.. 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. మరో 28 మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూసింది. అయితే, రెండు ఫార్మాట్లలో (న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు)కు సారథిగా వ్యవహరించే ఛాన్స్ లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని పేర్కొనింది. కెప్టెన్సీతో అదనపు పని భారం పడుతోంది అన్నారు. దాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నాను.. కానీ కెప్టెన్సీ అనేది కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా ఉంటుందని సోఫీ డివైస్ అన్నారు.
Read Also: S Jaishankar: పాకిస్తాన్‌తో చర్చలపై జైశంకర్ బిగ్ స్టేట్‌మెంట్..
అయితే, కెప్టెన్సీ కారణంగా నా వ్యక్తిగత ప్రదర్శనపై తీవ్ర ఒత్తిడి పడుతుందని న్యూజిలాండ్ సారథి సోఫీ డివైస్ అన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది.. అందుకే టీ20 కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాను.. ఆ తర్వాత నా ఆటపై మరింత దృష్టి సారిస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది. కొత్తగా జట్టు బాధ్యతలను ఎవరు చేపట్టిన వారికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తాను అని తెలిపారు. కాగా, వన్డేల్లో మాత్రం సారథిగా కొనసాగుతున్నా. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి మరి కొంత టైం పడుతుందని ఓ ప్రకటలో సోఫీ డివైన్ వెల్లించారు.
[ad_2]