Trending news

New Social Media Policy: యూపీలో కొత్త సోషల్ మీడియా పాలసీ.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..!

[ad_1]

  • కొత్త సోషల్ మీడియా పాలసీకి ఆమోదం తెలిపిన ఉత్తర ప్రదేశ్ కేబినెట్..

  • దేశ వ్యతిరేక కంటెంట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది..

  • ఫేస్‌బుక్.. ఎక్స్.. ఇన్‌స్టాగ్రామ్.. యూట్యూబ్‌ కంటెంట్ పై ఆంక్షలు విధించిన యూపీ సర్కార్..
New Social Media Policy: యూపీలో కొత్త సోషల్ మీడియా పాలసీ..  ఆమోదం తెలిపిన క్యాబినెట్..!

New Social Media Policy: ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో కొత్త సోషల్ మీడియా విధివిధానానికి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీలో అభ్యంతరకరమైన సోషల్ మీడియా కంటెంట్‌ను పరిష్కరించడానికి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం.. దేశ వ్యతిరేక కంటెంట్‌ను పోస్ట్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించింది.. ఇలాంటి కంటెంట్ వల్ల మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు జరిమాన విధించే అవకాశం ఉంది. ఇంతకుముందు, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ టెర్రరిజంతో వ్యవహరించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్లు 66E, 66F కింద నమోదు చేసే వారు.

Read Also: RSS Chief : ప్రధాని మోదీ, షాల తరహాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత

ఇక, సోషల్ మీడియాలో అశ్లీలత లేదా పరువుకు నష్టం కలిగించే విషయాలను ప్రచారం చేయడం వల్ల క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉందని ఈ పాలసీలో యూపీ సర్కార్ రూపొందించింది. అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాన్ని చట్టపరంగా ఎదుర్కొవాడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సోషల్ మీడియా కొత్త పాలసీ విధానంలో.. ప్రకటనలను నిర్వహించడానికి ప్రభుత్వం ‘V-ఫారమ్’ అనే డిజిటల్ ఏజెన్సీని రూపొందించింది. ఇందులో వీడియోలు, ట్వీట్‌లు, పోస్ట్‌లు, రీల్‌లను ప్రదర్శించడానికి ఏజెన్సీ ‘V-ఫారమ్’ బాధ్యత వహిస్తుంది. అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఖాతా హోల్డర్‌లు, ఆపరేటర్‌లకు చెల్లింపు పరిమితులను కూడా నిర్దేశించింది. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కోసం గరిష్టంగా నెలవారీ చెల్లింపు పరిమితులు వరుసగా రూ. 5 లక్షలు, రూ. 4 లక్షలు, రూ. 3 లక్షలకు సెట్ చేయగా.. యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్‌లు, పాడ్‌క్యాస్ట్‌ల చెల్లింపు పరిమితులకు రూ. 8 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 6 లక్షలు, రూ. 4 లక్షలుగా విధించింది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close