Nandyala: అమానుషం.. మానసిక వికలాంగురాలైన మైనర్పై అత్యాచారం

[ad_1]
- నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన
-
మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం -
గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధులు -
అత్యాచారం చేస్తూ వీడియోలు తీసిన ముగ్గురు మైనర్లు -
వీడియోలు వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన.

దేశంలో అత్యాచార ఘటనలు విపరీతమవుతున్నాయి. రోజుకో ఎక్కడో చోట ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు కామాంధులు. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినప్పటికీ కామాంధులు ఆడపిల్లలపై రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: CM Chandrababu: ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా చెడ్డ పేరు.. సీఎం కీలక వ్యాఖ్యలు
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆ బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ మైనర్లుగా గుర్తించారు. కాగా.. ఈ వీడియోలు వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో.. బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also: Draupadi Murmu: వైద్యురాలి అత్యాచార ఘటనపై తొలిసారిగా స్పందించిన రాష్ట్రపతి
[ad_2]