Trending news

Namitha: అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.. పాపం నమిత.!

[ad_1]

పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తోన్న నమిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఆమెకు ఊహించని ఘటన ఎదురైంది. ఆమెను ఓ దేవాలయంలోకి అనుమతించలేదు. అలాగే దేవాలయ సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించారంది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ గా మరి చక్కర్లు కొడుతున్నాయి. నమిత చెప్పింది ఏంటంటే.. కృష్ణాష్టమికి తన కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లాననీ.. తనను ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆపేశారనీ వీడియోలో చెప్పుకొచ్చింది. అలాగే వాళ్ళు తనను కొన్ని సర్టిఫికెట్స్‌ చూపించమన్నారట. దాంతో షాక్ అయ్యాననీ.. వాళ్ళు తనను అలా ఆపడం, సర్టిఫికెట్స్‌ చూపించమనడం తనను చాలా బాధపెట్టిందనీ అంది. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలకు వెళ్లినట్లు చెప్పింది నమిత. ఎప్పుడూ ఇలా జరగలేదనీ తనతో అమర్యాదగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరకుంటున్నానని అంది. అయితే నమిత కామెంట్స్ పై ఆలయ అధికారులు స్పందించారు. నమితతో ఎవ్వరూ అమర్యాదగా మాట్లాడలేదని తెలిపారు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడినట్లు చెప్పారు. పై అధికారులు చెప్పడంతో ఆమెను కొంత సమయం ఆపేశామనీ ఆ తర్వాత ఆలయంలోకి అనుమతించామని తెలిపారు.

నమిత చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం, వెంకటేష్ హీరోగా వచ్చిన జెమినిలో ఆకట్టుకుంది. అప్పట్లో బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలో మెరిసింది. అలాగే ఈ నటి తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకులు ఏకంగా నమితకు గుడి కూడా కట్టేశారు. ఇక ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close