Nalgonda : ఎలుకలు కరిచి 14 మంది విద్యార్థులకు గాయాలు

[ad_1]
Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు కొట్టడంతో 14 మందికి గాయాలయ్యాయి. ఉదయం గమనించిన సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం ఆలస్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరడంతో వారు హాస్టల్‌కు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వావిరాజి రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హాస్టల్‌ను సందర్శించారు. చిన్నారులను ఎలుకలు కొరికితే.. తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా దాస్తారని బీఆర్‌ఎస్ నాయకులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థినులను అడిగి వివరాలు సేకరించారు. గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు.

New Project 2024 09 01t131417.200
[ad_2]