Trending news

Nagarjuna: రజనీ సినిమాలో నాగ్.. లుక్ నెక్స్ట్ లెవెల్ గురూ

[ad_1]

Nagarjuna: రజనీ సినిమాలో నాగ్.. లుక్ నెక్స్ట్ లెవెల్ గురూ

King Nagarjuna As Simon In Superstar Rajinikanth, Lokesh Kanagaraj Coolie Movie: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్‌’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ను జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జునను ప్రత్యేక పాత్రలో పోషించినట్లు నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ చేశారు.

Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం

నాగార్జున ను సైమన్‌గా పరిచయం చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్‌ను ప్రజెంట్ చేస్తోంది. స్టైలిష్ షేడ్స్ మెరుస్తున్న గోల్డ్ వాచ్‌తో కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. రజనీకాంత్, నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్. నాగార్జున పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు గిరీష్ గంగాధరన్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close