Nagarjuna: దక్షిణాది ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ హీరో.. కింగ్ నాగార్జునకు ఎన్ని వేల కోట్లు ఆస్తులున్నాయో తెలుసా?

[ad_1]
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గురువారం (ఆగస్టు 29) తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కింగ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్త్ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన ఎంతో హ్యాండ్సమ్ గా, చాలా ఫిట్‌గా ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో నాగార్జున కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 3,100 కోట్ల రూపాయలని తెలుస్తోంది. 1986లో విడుదలైన ‘విక్రమ్’ సినిమాతో నాగార్జున సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌కి హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియో ఉంది. అలాగే నాగార్జునకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఇది ఒక NGO. ఇందులో సినిమా గురించిన విద్యను అందిస్తున్నారు.
నాగార్జునకు హైదరాబాద్‌లో పలు ఆస్తులున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి విలువ రూ.50 కోట్లు. ఆయన సినిమా స్టూడియో విలువ 200 కోట్ల రూపాయలు. నాగార్జున దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.5 కోట్లు), ఆడి ఎ7 (రూ. 90.5 లక్షలు), బీఎమ్‌డబ్ల్యూ ఎమ్6 (రూ. 1.76) వంటి లగ్జరీ కార్లు నాగార్జున గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో అత్యంత సంపన్న నటుల్లో షారుఖ్ ఖాన్ (రూ. 6000 కోట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 3600 కోట్ల ఆస్తులతో అక్కినేని నాగార్జున మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. నాగ్ ఒక్కో సినిమాకు 20-30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. . అలాగే బిగ్ బాస్ హోస్ట్ గా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. నాగార్జునకు కూడా క్రీడలంటే ఆసక్తి. అందుకే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ‘ముంబై మాస్టర్స్’ టీమ్‌ను కొనుగోలుచేశారు కింగ్.
ఇవి కూడా చదవండి
Wishing a Musical Birthday to The King, Nagarjuna Akkineni sir from Team #DSPLiveIndiaTour 🎉
Celebrate the royal combo hits of the King & Rockstar🤘🔥 on October 19th, at Gachibowli Stadium! @iamnagarjuna @ThisIsDSP
Tickets available on 🎟https://t.co/nQPvWrbhP1
or… pic.twitter.com/CP2NCsqiVo— ACTC Events (@actcevents) August 29, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన ‘నా సామి రంగ’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ‘కుబేర’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.
నాగ చైతన్య, శోభితలతో నాగార్జున..
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]