Trending news

Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

[ad_1]

  • దగ్గరైన వాళ్లంతా ఉండాల్సిందే

  • పెళ్లి అలాగే చేసుకుంటా

  • పెళ్లిపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Naga Chaitanya Comments on Marriage Goes Viral: నాగచైతన్య త్వరలో శోభితతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అనేక ప్రచారాల తర్వాత కొద్ది రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు, ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లి ఎప్పుడు ? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే చైతన్య, శోభిత పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది లాంటి విషయాల మీద తాజాగా నాగచైతన్య స్పందించాడు. నిశ్చితార్థం తర్వాత నాగచైతన్య తన పెళ్లి గురించి స్పందించడం హార్ట్ టాపిక్ అవుతోంది. ఆయన తాజాగా ఒక వెడ్డింగ్ బ్రాండ్ ప్రమోషన్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా చైతన్యతో మీడియా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది.

Bolisetty Srinu: అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గిన జనసేన ఎమ్మెల్యే?

మీ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకుంటారు? సింపుల్ గా చేసుకుంటారా? లేకపోతే గ్రాండ్గా చేసుకుంటారా? అని అడిగితే. పెళ్లంటే నా మనసుకు నచ్చిన వాళ్ళందరూ ఉండాలి, భారీ స్థాయిలో గ్రాండ్గా చేసుకోవాలని కాదు కానీ సంప్రదాయం ప్రకారం అందరి సమక్షంలో పెళ్లి జరగాలని, అదే తనకు ఇష్టమని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడ చేసుకోబోతున్నానని వివరాల త్వరలోనే అధికారికంగా చెబుతానని అన్నారు. అంతేకాక ఇటీవల కాలంలో తన తండ్రికి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగచైతన్య స్పందించే ప్రయత్నం చేయలేదు. దాని గురించి చెప్పాల్సినదంతా తన తండ్రి ట్విట్టర్ ద్వారా చెప్పారని, ఇప్పుడు తానేమీ మాట్లాడాలి అనుకోవడం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close