Trending news

Naga Chaitanya: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.. ఏమాన్నారంటే..

[ad_1]

భాగ్యనగరంలో చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ అక్రమ బిల్డింగులను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాదాపూర్‏లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా బృందం కూల్చివేసింది. దీనిపై ఇప్పటికే నాగార్జున పలుమార్లు రియాక్ట్ అయ్యారు. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని.. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు సంబంధించిన పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగిందని.. ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా ఇచ్చారని పేర్కొన్నారు. తమ ఎన్ కన్వెషన్ సెంటర్ కు సంబంధించిన వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని.. ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు నాగార్జున. తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య స్పందించారు.

తాజాగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను మీడియా ఈ విషయం ప్రశ్నించింది. ఇందుకు చైతన్య స్పందిస్తూ.. ఆ విషయం ఇప్పుడు వద్దని.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాన్న ట్విట్టర్ వేదికగా అన్ని వివరాలు చెప్పారని అన్నారు. డెస్టినేషన్ లేదా హైదరాబాద్ లోనే మీ పెళ్లి జరుగుతుందా అని ప్రశ్నించగా ఇంకా ఏం నిర్ణయించలేదని అన్నారు. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో త్వరలోనే అందరికీ తెలుస్తాయని అన్నారు. అలాగే మంచి కథ ఉంటే శోభిత, తాను కలిసి నటిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారని అడగ్గా.. తనను ఎక్కువగా చూపిస్తున్నారని అన్నారు.

అలాగే తండేల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తన లుక్ ఆ సినిమా కోసమేనని అన్నారు. ఇప్పటివరకు తను చేసిన అన్ని సినిమాలతో పోలిస్తే తండేల్ పాత్ర అత్యంత సవాల్ తో కూడుకున్నదన్నారు. నిజమైన కథ ఆధారంగా రూపొందుతుందని అన్నారు. నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం ఈనెల 8న జరిగింది. వీరిద్దరు చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి నెట్టింట అనేక రూమర్స్ హల్చల్ చేశాయి. తాజాగా నిశ్చితార్థం వేడుకతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close