Trending news

Mythri Ravi Shankar: పుష్పపై పవన్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

[ad_1]

  • పుష్పపై పవన్ కామెంట్స్

  • క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  • మత్తు వదలరా 2 సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్
Mythri Ravi Shankar: పుష్పపై పవన్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Mythri Ravi Shankar Reaction on Pawan Pushpa Comments: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన బెంగళూరు పర్యటనలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో ఆయన సినిమా పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశాడనే వాదన వినిపించింది. అయితే తాజాగా దానిమీద క్లారిటీ ఇచ్చారు పుష్ప పుష్ప సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో మత్తు వదలరా 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ కి ఈ కామెంట్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ పుష్ప గురించే కదా మాట్లాడారు అనగానే ఛీ ఛీ అదేమీ కాదు.

Sharad Pawar: జెడ్ ప్లస్ సెక్యూరిటీని నిరాకరించిన శరద్ పవార్

కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు కానీ మనం ఈ సినిమాకని, దానికని దీనికని అప్లై చేసుకుంటున్నాం. ఆయన స్టేజ్ వేరు, ఆయన వచ్చిన సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి ఆయన సినిమాను తక్కువ చేయాలని అనుకోరు. అదేదో ఫ్లోలో వచ్చింది మనం దీనికి దానికి అంటించుకుని ఆయన ఇలా అన్నారు అనుకుంటున్నాము తప్ప అంతకు మించి ఏమీ లేదని అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తొలత భవదీయుడు భగత్ సింగ్ అనే పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశారు. తర్వాత అది షెల్వ్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని మొదలుపెట్టారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో సినిమా షూట్ కాస్త వాయిదా పడుతూ వస్తోంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close