Mumbai Court: మహిళని చూసి కన్నుకొట్టిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిన కోర్టు..

[ad_1]
- మహిళని చూసి కన్నుకొట్టిన వ్యక్తి..
-
దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు..

Mumbai Court: మహిళ అణుకువకు భంగం కలిగించడం, వారితో అనుచితంగా ప్రవర్తించడం కూడా తీవ్ర శిక్షార్హమైన నేరమే. ముంబైకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చూసి కన్నుకొట్టిన నేరంలో దోషిగా నిర్ధారించబడ్డాడు. అయితే, యావజ్జీవ శిక్ష తప్పదని భావించినప్పటికీ, అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, అతడి వయసు కారణంగా ప్రొబేషన్ బెనిఫిట్ ఇవ్వాలని ముంబై కోర్టు మేజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి అభిప్రాయపడ్డారు.
మహిళ అనుభవించిన మానసిక వేదనను, వేధింపులను విస్మరించలేమని, అయితే నిందితుడికి శిక్ష విధించడం వల్ల అతని భవిష్యత్తు మరియు సమాజంలో అతని ఇమేజ్‌పై ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 354 (మహిళల అణకువ) కింద నిందితుడు మహ్మద్ కైఫ్ ఫకీర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. రూ. 15,000 బాండ్ అందించిన తర్వాత ఫకీర్‌ని విడుదల చేయాలని, పిలిచినప్పుడు ప్రొబేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
Read Also: Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
ఏఫ్రిల్ 2022లో దక్షిణ ముంబైలోని బైకుల్లాకు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ప్రకారం.. స్థానిక మహిళ దగ్గర్లోని దుకాణం నుంచి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసింది. అందులో పనిచేసే వ్యక్తి వాటిని డెలివరీ చేయడానికి మహిళ ఇంటికి వెళ్లాడు. నిందితుడు మహిళను ఒక గ్లాస్ నీరు అడిగాడు, ఆమె నీటిని అందిస్తున్నప్పుడు కావాలని చేతుల్ని తాకడంతో పాటు కన్నుకొట్టాడు. కిరాణా సామాగ్రిని అందిస్తున్న సమయంలో కూడా మరోసారి ఆమె చేతిని తాకి, మళ్లీ కన్నుకొట్టాడు. మహిళ అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి పారిపోయాడు.
ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాను పొరపాటున మహిళ చేతిని తాకానని, ఆమె నమ్రతను కించపరిచే ఉద్దేశం తనకు లేదని నిందితుడు కోర్టులో చెప్పాడు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు, బాధితురాలు మాత్రమే ఉన్నప్పటికీ, సాక్ష్యాధారాలు, మహిళ వాంగ్మూలం నిందితుడి జోక్యాన్ని రుజువు చేసేంత బలంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
[ad_2]
Source link