Mr.Celebrity Teaser: మీడియాపై సెటైర్లు వేస్తూ పరుచూరి బ్రదర్స్ వారసుడి ఎంట్రీ!

[ad_1]
- మీడియాపై సెటైర్లు వేస్తూ పరుచూరి బ్రదర్స్ వారసుడి ఎంట్రీ
-
రుచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ఎంట్రీ -
‘మిస్టర్ సెలబ్రెటీ’ అనే టైటిల్ తో సినిమా

Parachuri Brothers Grand Son Sudarshan Debuting with Mr.Celebrity Movie: సినీ పరిశ్రమలో స్టార్ల వారసులు కూడా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ఒకప్పుడు కేవలం హీరోల వారసులు మాత్రమే హీరోలు అయ్యేవారు. కానీ మారిన ట్రెండ్ కి తగ్గట్టు హీరోల వారసులు మాత్రమే కాదు దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం, స్టార్లుగా ఎదుగుతున్న దాఖలాలు ఎక్కువ అయ్యాయి. అయితే హీరోల వారసులు దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం ఓకే కానీ రచయితల వారసులు హీరోలవ్వడం చాలా అరుదు. అయితే ఇప్పుడు సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఆయనను టాలీవుడ్ కి పరిచయం చేసే కార్యక్రమం ఈరోజే హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ‘మిస్టర్ సెలబ్రెటీ’ అనే టైటిల్ తో ”నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ..తెలియనిది మాట్లాడ్డం నేరం” అనే క్యాప్షన్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
Tollywood: పెద్ద నిర్మాతలు.. చిన్న సినిమాలు.. ఏంటీ గందరగోళం?
వాక్ స్వాతంత్ర్యం, మీడియా స్వేచ్ఛ పేరుతో గాసిప్పులు ప్రచారం చేసి, సెలబ్రెటీ జీవితాలతో ఆడుకొనే మీడియా తీరుపై సెటైరికల్ గా చేసిన సినిమా అని టీజర్ చూస్తే అర్ధమైపోతుంది. ఇక అది కాక యాక్షన్ తో పాటు, థ్రిల్లింగ్ అంశాల్ని కూడా ప్రేక్షకుల కోసం సిద్ధం చేసినట్టు అనిపిస్తోంది. ఇక తమ మనవడి సినిమాకి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించడం విశేషం. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించగా సీనియర్ నటులు రఘుబాబు, నాజర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో సి. రవికిషోర్ బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిజానికి పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్రనాథ్ అంటే సుదర్శన్ తండ్రి హీరోగా ప్రయత్నించాడు. ఆయన ‘జంక్షన్’లాంటి సినిమా చేసినా ఎందుకో హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. ఇప్పుడు సుదర్శన్ అయినా నిలబడతాడని పరుచూరి ఫ్యామిలీ భావిస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.
[ad_2]