Mr Bachchan OTT: ముందుగానే ఓటీటీలోకి ‘మిస్టర్ బచ్చన్’.. ఆ స్పెషల్ డేనే స్ట్రీమింగ్.. ఎందులోనంటే?

[ad_1]
మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ యాక్షన్ ఎంటర టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నల గడ్డ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం.. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. షాక్, మిరపకాయ్ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలో రిలీజైంది. అయితే అంచనాలు అందుకోవడంలో ఈ మూవీ తడబడింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. దీనికి తోడు బరిలో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, ఆయ్ సినిమాలు నిలవడంతో గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయడు మిస్టర్ బచ్చన్. అయితే ఎప్పటిలాగే రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అభిమానులను అలరించాడు. అలాగే కొత్త హీరోయిన్, భాగ్యశ్రీ భోర్సే అందాలు, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మిస్టర్ బచ్చన్ సినిమాను కొంతలో కొంత నిలబెట్టాయి. థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది.
ఇవి కూడా చదవండి
అయితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాను అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. వినాయక చవితి పండడ కానుకగా సెప్టెంబరు 6 లేదా 7వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని టాక్. పండగ పూట సెలవు కావడంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడున్నట్లు సమాచారం.
మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ..
Let’s get nostalgic ✨
What was your A Side and B Side playlist during the 90s?
Do not miss the MASS ENTERTAINER #MrBachchan in theatres near you 💥
Book your tickets now!
🎟️ https://t.co/fBC3B1CnCW#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you… pic.twitter.com/qKdbWyCNQj— People Media Factory (@peoplemediafcy) August 20, 2024
రవితేజ క్రేజ్, హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని దాదాపు ఇరవై ఐదు కోట్లకు మిస్టర్ బచ్చన్ మూవీ దక్షిణాది భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించారు. జగపతి బాబు విలన్ గా నటించారు. అలాగే కమెడియన్ సత్య, ప్రవీణ్, ఝూన్సీ, సచిన్ ఖేడ్కర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.
మిస్టర్ బచ్చన్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]