MP K.Laxman : అసలైన సమస్యలను పక్కదోవ పట్టించాలనే ప్రయత్నం

[ad_1]

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకు పోయి దివాలా తీస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఉచితాలు, హామీలు గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలయ్యాక ప్రజల గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ ఢిల్లీకి ఎటీఎంగా మార్చారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, తులం బంగారం లేదని, నిరుద్యోగ భృతి లేదని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా ను తెరపైకి తెచ్చారని, హైదారాబాద్ లో చెరువులను పరి రక్షించాల్సిందే.. కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు ఎంపీ లక్ష్మణ్. కబ్జాలకు సంబంధించిన వివరాలు బయట పెట్టాలని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందన్నారు.
Pakistan: పాక్‌కి సాయం చేయొద్దని చెప్పినా పెంటగాన్ వినలేదు.. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు..
అంతేకాకుండా..’అసలైన సమస్యలను పక్కదోవ పట్టించాలని ప్రయత్నం. దేవాదాయ భూములు, అసైన్ భూముల పై శ్వేత పత్రం విడుదల చేయాలి. పేద, మధ్య తరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న వాటి పై ప్రతాపం చూపకండి. తెలంగాణ మొత్తం విష జ్వరాలతో ఉంది… హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి… పాలన మొత్తం గాడి తప్పింది… ప్రజారోగ్యం పడకేసింది… ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో బిజెపి ఉద్యమ బాట పడుతుంది. త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుంది… కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌లు కొత్తగా కలిసేది ఏముంది… వాళ్ళు ఎప్పుడో కలిశారు.. కోర్టులకు రాజకీయ రంగు పులమడం కాంగ్రెస్ కే చెల్లింది. వడ్డీతో సహా చెల్లిస్తా అన్న కవిత వ్యాఖ్యలు వెల్కమ్ చేస్తున్నాం… కోర్ట్ లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది.. అధికారం లోకి రాకపోవడంతో బీఆర్‌ఎస్ వాళ్ళకి పిచ్చి ముదిరింది… బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం దుకాణం బంద్.. ‘ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Trump rally: ట్రంప్ సభలో మరో అలజడి.. వేదికపైకి వెళ్లేందుకు యత్నం.. అరెస్ట్
[ad_2]