Motivational: జీవితం ప్రశాంతంగా ఉండాలా.? బుద్ధుడు చెప్పిన బోధనలు చదవాల్సిందే

[ad_1]
జీవితం ప్రశాంతంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఎంత సంపాదన ఉన్న వారైనా, అసలు ఆస్తి లేని వారైనా సరే ప్రతీ ఒక్కరి లక్ష్యం ప్రశాంతమైన జీవితం. అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మన ప్రశాంతతను దూరం చేస్తుంటాయి. అయితే మనిషికి ప్రశాంతతను అందించే ఎన్నో గొప్ప బోధనలు ఉన్నాయి. వీటిలో గౌతమ బుద్ధుడి బోధనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బుద్ధుడి బోధనలు మన జీవన విధానాన్నే మార్చేస్తాయి. ప్రశాంత జీవితం కోసం బుద్ధుడు చెప్పిన కొన్ని బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* మనం మాట్లాడే విధానంపైనే మనతో ఎదుటి వారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది. అందుకే మాటలను పొదుపుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మన మాటలతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.
* మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో గతం గురించి ఆలోచిండం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం. అందుకే వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి.
* మన ఆలోచనలో మన జీవితాన్ని నిర్ణయిస్తాయని తెలిసిందే. అందుకే నిత్యం పాజిటివ్ ఆలోచనలను అలవాటు చేసుకోవాలి. మనస్సు నిత్యం పాజిటివ్ ఆలోచనలతో నింపేందుకు ప్రయత్నం చేయాలి.
* జీవితంలో ప్రశాంతతను దూరం చేయడానికి కోపం కూడా ముఖ్య కారణంగా చెప్పొచ్చు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
* మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా, సంతోషంగా జీవించాలన్నా తృప్తిగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఉన్నదాంట్లో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి.
* మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు. మీ చుట్టు పక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. మార్పును ఆహ్వానించగలగాలి అప్పుడే ప్రశాంతంగా జీవించగలరు.
* ప్రశాంతంగా ఉండాలంటే చేయాల్సిన మరో పని క్షమించడం. క్షమించే గుణం ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటారు. అంతేకాదు గొప్ప మనసు ఉన్న వారు మాత్రమే క్షమించగలరు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..
[ad_2]