Most Centuries In Cricket: ప్రస్తుత క్రికెట్ ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించింది వీరే..

[ad_1]
- అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
- రెండవ బ్యాట్స్‌మెన్‌గా రూట్
- రోహిత్ శర్మ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Most Centuries In Cricket: తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్దలుగొట్టిన రూట్, అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సాధించాడు. ఇక ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. జో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కానీ., ఆగస్టు 29న లార్డ్స్ లో తన టెస్ట్ కెరీర్‌లో 33వ సెంచరీని సాధించి రెండో స్థానాన్ని సాధించాడు. దింతో జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ప్రస్తుతం అతడు మొత్తం 80 సెంచరీలు చేశాడు. అతని తర్వాత రూట్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రూట్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 49 సెంచరీలు ఉన్నాయి. రూట్ కంటే ముందు.. భారత స్టార్ రోహిత్ శర్మ 48 సెంచరీలతో జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రస్తుత క్రికెట్ ఆటగాళ్లు..
01: విరాట్ కోహ్లీ – 80 సెంచరీలు..
02: జో రూట్ – 49 సెంచరీలు.
03: రోహిత్ శర్మ – 48 సెంచరీలు.
04: కేన్ విలియమ్సన్ – 45 సెంచరీలు.
05: స్టీవ్ స్మిత్ – 44 సెంచరీలు.
06: బాబర్ ఆజం – 31 సెంచరీలు.
07: క్వింటన్ డి కాక్ – 28 సెంచరీలు.
08: జానీ బెయిర్‌స్టో – 23 సెంచరీలు.
09: టామ్ లాథమ్ – 20 సెంచరీలు.
10: ముష్ఫికర్ రహీమ్ – 20 సెంచరీలు.
[ad_2]