Trending news

Mopidevi Venkataramana: రాజీనామాపై మోపిదేవి సంచలన వ్యాఖ్యలు.. అందుకే వైసీపీకి గుడ్‌బై..

[ad_1]

  • వైసీపీకి రాజీనామాపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు..

  • రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు..

  • ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నా..

  • నాకు ఉన్న ఇబ్బందులు.. సమస్యలతో వైసీపీని వీడాలని నిర్ణయం..
Mopidevi Venkataramana: రాజీనామాపై మోపిదేవి సంచలన వ్యాఖ్యలు.. అందుకే వైసీపీకి గుడ్‌బై..

Mopidevi Venkataramana: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజీనామాకు ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు అని స్పష్టం చేశారు.. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో.. నాకు ఉన్న ఇబ్బందులు, సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. ఒక పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు.. కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో నాకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందాను.. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Second Marriage: భార్య మంచి మనసు.. దగ్గరుండి భర్తకు మరో యువతితో పెళ్లి..

నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నాను అన్నారు మోపిదేవి.. కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న ఆయన.. ఇప్పటికి ఓటమిపై సమీక్ష జరగలేదు.. భవిష్యత్తులో లోటుపాట్లపై సమీక్ష చేసుకుంటారనుకుంటున్నాను అన్నారు. అయితే, నాకు రాజ్యసభకు రావడం ఇష్టం లేదు.. నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను అని స్పష్టం చేశారు.. పార్టీని వీడొద్దు.. పార్టీలోనే ఉండాలని వైసీపీ పెద్దలు నాతో మాట్లాడారు.. నా సమస్యలు వారికి చెప్పాను అన్నారు. ఇక, నేను చేరే పార్టీలో ముందు నుంచి ఉన్న కొందరు నేతలు, కార్యకర్తలతో స్థానికంగా సమస్యలు వస్తాయి. అది సహజం.. సమన్వయంతో ముందుకు వెళ్తాను అన్నారు. నా నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించారు. నేను, నాతో పాటు బీద మస్తాన్ రావు ఈరోజు రాజీనామా చేస్తున్నాం.. టీడీపీలో పార్టీ పెద్దలతో మాట్లాడాను.. త్వరలో టీడీపీలో చేరతాం అని ప్రకటించారు మోపిదేవి వెంకటరమణ..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close