Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి పూనకాలే..?

[ad_1]
- బాలయ్య కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
- ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు ఎంట్రీ
- సెప్టెంబరు 6న అధికారక ప్రకటన

సెప్టెంబరు 1న బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టాలీవుడ్ టాప్ హీరోలందరు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్న తరుణం రానే వచ్చింది.
Also Read: Samantha : ఇన్‌స్టాగ్రామ్ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?
బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి. ఈ చిత్ర కథ మైథలాఙికల్ టచ్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని మోక్షు పుట్టిన రోజు కానుకగా సెప్టెంబరు 6న ప్రకటించబోతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు అనే క్లారిటీ రాలేదు. బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని మొదట టాక్ వినిపించింది. కానీ తాజాగా SLV బ్యానర్ పై దసరా వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్ర అధికారక ప్రకటన రానుంది. బహుశా అప్పుడు గాని క్లారిటీ రావొచ్చు
[ad_2]