Trending news

MLC Kavitha: నేడు హైదరాబాద్‌ రానున్న కవిత.. ఎన్ని గంటలకు అంటే..

[ad_1]

  • ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు..

  • ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు..
MLC Kavitha: నేడు హైదరాబాద్‌ రానున్న కవిత.. ఎన్ని గంటలకు అంటే..

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read also: NSG New Chief: ఎన్‌ఎస్‌జీ కొత్త డైరెక్టర్ జనరల్గా బి. శ్రీనివాసన్‌..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి 9 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదల కావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెయిల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వచ్చింది. జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్త, సోదరుడిని కౌగిలించుకుని కన్నీరుపెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూనే.. పోరాటం కొత్త కాదని..18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని తెలిపారు కవిత. బీఆర్ఎస్ పార్టీకి, కేసిఆర్ కి, నాకు, నా కుటుంబానికి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి, మన కుటుంబానికి ఇబ్బందులు సృష్టించిన వాళ్లకు కచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబానికి వెన్నంట ఉన్న ప్రతి ఒక్కరికి పాదయాభివందనాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు. ఐదున్నర నెలలు కుటుంబం నుంచి విడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తీహార్ జైలుకు చేరుకున్నారు. వసంత్ విహార్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న కవితను గుమ్మడికాయతో కవితకు దిష్టి తీసి స్వాగతించారు పార్టీ శ్రేణులు.

Read also: Physical Relationship: జీవితంలో శృంగారం డోసుకు మించి చేస్తే జరిగేది అదే..

హరీష్ రావు, కేటీఆర్‌తో పాటు.. కవిత భర్త అనిల్ కుమార్, ఆమె పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జాగృతి కార్యకర్తలు జైలు వద్ద కవితకు స్వాగతం పలికారు. గంటల తరబడి వేచి ఉన్న కవితకు ‘కవితా.. పోరాట యోధుడి కూతురు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారు. జైలు చుట్టూ స్వీట్లు పంచారు. జైలు నుంచి కవిత నేరుగా వసంత విహార్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్, హరీశ్‌తో పాటు పార్టీ నేతలకు స్వీట్లు పంచారు. అన్ని పార్టీల నేతలతో చాలా సేపు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలంతా కవితను ప్రోత్సహించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తగ్గేది లేదని కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో.. సీబీఐ, ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవిత 10 లక్షల రూపాయల పూచీకత్తుపై విడుదలయ్యారు. పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సమర్పించాల్సి ఉండటంతో ప్రక్రియ అంతా త్వరగా ముగించి మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేశారు.
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌..



[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close