Minister Satya Kumar Yadav Sensational Comments On YS Jagan

[ad_1]
- చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా..
- అబద్ధాలు చెప్పడం.. వక్రీకరించడం జగన్ నైజం.. నాది కాదు..
- సమాధానం చెప్పకుండా బురదజల్లడం జగన్కు అలవాటే: మంత్రి సత్య కుమార్

Minister Satya Kumar: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు. శాసన మండలిలో నేను నవ్వుతూ సమాధానం చెప్పానని జగన్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా అని ప్రశ్నించారు. ఓల్డ్ హ్యాబిట్స్.. డై హార్డ్ (OLD HABITS DIE HARD) అంటే ఇదే అని చెప్పుకొచ్చారు. అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం జగన్ నైజం.. నాది కాదన్నారు. ఇక, విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణాలున్నాయి.. గత ఐదేళ్లుగా పైపు లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు చెంపా నదీ తీరంలో టాయిలెట్లు లేకపోవడం వల్ల బహిరంగ మల విసర్జన కూడా ఒక కారణం అని మంత్రి సత్య కుమార్ అన్నారు.
Read Also: Retiring Room In Railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
ఇక, ఐదేళ్లుగా కనీసం క్లోరినేషన్ కూడా చేయకపోవడం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి సాక్ష్యం అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన నీరు అందించే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. గత 15 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్న వారికి కనీస బాధ్యత లేద అని నేను మండలిలో గుర్తు చేశాను.. సమాధానం చెప్పకుండా మాపై బురద జల్లడం ఆ పార్టీ అధినేతకూ.. వారి వందిమాగధులకూ అలవాటే అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరోపించారు.
[ad_2]